క్రైమ్/లీగల్

చిదంబరం కస్టడీ పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం జుడీషియల్ కస్టడీని రెండు వారాలు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలిచ్చింది. అంటే ఆయన అక్టోబర్ 3 వరకూ తీహార్ జైలులో ఉండాల్సిందే. చిదంబరానికి వైద్యపరీక్షలు చేయించుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో మరింత లోతుగా విచారించాల్సి ఉన్నందున జుడీషియల్ కస్టడీ పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహర్ ఆమోదించారు. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం కోర్టులో వాదనలు వినిపించారు. జుడీషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ మాజీ కేంద్ర మంత్రి తీరులో ఎలాంటి మార్పులేదని తుషార్ వెల్లడించారు. ఆయనకు మరో రెండు వారాల రిమాండ్ విధించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. దీంతో జడ్జి కుహర్ అక్టోబర్ 3 వరకూ రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. తన క్లయింట్‌కు రోజూ వైద్యపరీక్షలు అవసరమని అలాగే తీహార్ జైలులో ప్రత్యేక ఆహారం ఇవ్వాల్సి ఉంటుందని సిబల్ తెలిపారు. 73 ఏళ్ల చిదంబరం అనేక అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. గుండెకు సంబంధించి అలాగే హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తీహార్ జైలుకు తీసుకొచ్చాక బరువుతగ్గిపోయారని కపిల్ సిబల్ తెలిపారు. మాజీ ఆర్థిక మంత్రి గది బయట హాలులో కూర్చొనడానికి ఓ కుర్చీ ఏర్పాటు చేయాలని మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోరారు. మంచపై తప్ప కూర్చోలేరని కనీసం తలగడ కూడా జైలు అధికారులు సమకూర్చలేదని ఆయన చెప్పారు. ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు చిదంబరానికి అనుమతి ఇవ్వాలని సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. జైలులో ఖైదీలందరి ఆరోగ్యం ముఖ్యమేనని, చట్టం ఏం చెబితే అధికారుల అలా నడుచుకుంటారని తుషార్ మెహతా పేర్కొన్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ పెట్టుబడులు వచ్చేలా ఆర్థిక మంత్రి చిదంబరం సహకరించారని అభియోగం. 2017 మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2007లో యూపీఏ హయాంలో ఇది చోటుచేసుకోగా పదేళ్ల తరువాత ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక వెలుగుచూసింది. సీబీఐ ఆరోపణల తరువాతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా అదే ఏడాది చిదంబరంపై కేసు నమోదు చేసింది.