క్రైమ్/లీగల్

సోమవారం అదనంగా గంటసేపు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదం కేసును సోమవారం అదనంగా గంట సేపు విచారించనున్నట్టు సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయంగా సునిశితమయిన ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 28వ రోజు శుక్రవారం విచారణ సందర్భంగా ఈ విషయం వెల్లడించింది. సెప్టెంబర్ 23వ తేది ఈ కేసు విచారణను సాయంత్రం నాలుగు గంటల వరకు బదులుగా అయిదు గంటల వరకు విచారించనున్నట్టు రాజ్యాంగ ధర్మాసనం హిందూ, ముస్లిం పక్షాల న్యాయవాదులకు తెలిపింది. అత్యున్నత న్యాయస్థానంలో మామూలుగా విచారణలు సాయంత్రం నాలుగు గంటలకే ముగుస్తాయి. ‘మేము సోమవారం (సెప్టెంబర్ 23) అదనంగా గంట సేపు కూర్చుంటాము’ అని న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఏ నజీర్ సభ్యులుగా గల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయిన కృష్ణ మురారి, ఎస్‌ఆర్ భట్, వి.రామసుబ్రమణియన్, హృషికేశ్ రాయ్ సెప్టెంబర్ 23వ తేదీ పదవీస్వీకార ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి. అయోధ్య స్థల వివాదం కేసులో అక్టోబర్ 18లోగా అన్ని వాదనలు పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం గడువు పెట్టుకుంది. అందువల్ల నవంబర్ నెల మధ్య నాటికి ఈ కేసులో తీర్పు వెలువడుతుందని భావిస్తున్నారు.