క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, ఏప్రిల్ 14:బత్తులూరుపాడు-యనకండ్ల మార్గం మధ్యలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యనకండ్లకు చెందిన సుబ్బరాయుడు(25) దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ రాకేశ్ తెలిపిన వివరాలు.. బనగానపల్లె నుంచి పలుకూరులోని గనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా, అతి వేగంగా నడపడం వల్ల ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకుపోయిందన్నారు. ఈ సంఘటనలో ట్రాక్టర్ ట్రాలీలో కూర్చున్న సుబ్బరాయుడు ఎగిరి కిందపడగా అతడిపై ట్రాలీ టైరు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం కోసం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో వున్నాడని ఎస్‌ఐ తెలిపారు.