క్రైమ్/లీగల్

ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లారీని ఢీకొన్న మారుతీ వ్యాను
ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు దుర్మరణం
మరో ఐదుగురికి తీవ్రగాయాలు బాధితులంతా విశాఖ జిల్లావాసులు

నల్లజర్ల, సెప్టెంబర్ 20: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల శివార్లలో జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మారుతీ ఓనీ వ్యాను ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు పసికందులు సహా ఆరుగురు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామం నుండి ఒకే కుటుంబానికి చెందిన 11మంది ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి మారుతీ వ్యానులో బయలుదేరారు. శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో నల్లజర్ల-దూబచర్ల మధ్యలో
ఎదురుగా వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న వ్యాను బలంగా ఢీకొంది. దీనితో కారులో ప్రయాణిస్తున్న తమ్మిన నీలకంఠరావు (55), తమ్మిన లక్ష్మి (50) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన పలుకూరి అప్పలరాజు (35), ఎక్కల రామకృష్ణ (45)ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఎక్కల తనూజ (3), ఎనిమిది నెలల పసికందు పలుకూరి జ్ఞానశ్వర్ నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ప్రమాదంలో తమ్మిన మణికంఠ (24), ఎక్కల రమాదేవి (40), పలుకూరి యశ్వన్ (4), ఎక్కల రేష్మ (6), పలుకూరి నీలిమ (30) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఏలూరు, తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రవికుమార్, నల్లజర్ల ఎస్సై చంద్రశేఖర్ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులను పోలీసు వాహనాల్లోనే తరలించారు. ప్రమాద సమయంలో వ్యానులో ఉన్న వారి సెల్‌ఫోన్లు ధ్వంసం కావడం, బాధితుల్లో ఎవరూ మాట్లాడే స్థితిలో లేకపోవడంతో వారి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు విశేషంగా శ్రమించాల్సివచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్, కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.