క్రైమ్/లీగల్

ఇంటర్ ఫెయిలైన విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, ఏప్రిల్ 14: పరీక్షా ఫలితాలు మరో విద్యార్థి ప్రాణాలను బలిగొన్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదనే మనస్తాపంతో చెట్టుకు ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందివస్తాడనుకున్న కొడుకు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కొత్తవీధి చెందిన పచ్చిగొళ్ళ విజయ్(18) అనే విద్యార్థి స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసాడు. గురువారం ప్రకటించిన ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో విజయ్ ఫెయిలయ్యాడు. తాను పరీక్ష పాస్ కాలేదని ఈవిషయం తెలిస్తే తల్లిదండ్రులు ఏమంటారోననే భయంతో ఇంటికి వెళ్ళకుండా అదృశ్యమయ్యాడు. సాయంత్రానికి కొడుకు ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ విజయ్ ఆచూకీ తెలియరాలేదు. రెండు రోజులుగా అదృశ్యమైన విజయ్ శనివారం బలిఘట్టం సమీపంలోని సరుగుడు తోటలో శవమై మామిడి చెట్టుకు వేలాడి ఉండడంతో చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులకు కొడుకు శవమై వేలాడుతుండడం చూసి తట్టుకోలేక పోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిన విజయ్ ఇంటికి వెళ్ళకుండా ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. తండ్రి శ్రీనివాసరావు కిరాణా వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెరిగి పెద్దవాడై ఉన్నత చదువులు చదువుకుని పేరు ప్రతిష్టలు తెస్తాడనుకున్న కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో వారి వేదన వర్ణనాతీతమైంది. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి మృత దేహాన్ని తరలించారు. ఈమేరకు పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.