క్రైమ్/లీగల్

హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), సెప్టెంబర్ 20: రాష్ట్ర హైకోర్టును అమరావతి నుండి తరలించరాదని, 13 జిల్లాలకు మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉన్న హైకోర్టు ప్రస్తుతం అన్ని జిల్లాల వారికి అనుకూలంగా ఉందని పలు జిల్లాల న్యాయవాదుల ప్రిసీడియం సభ్యులు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు వినతిపత్రం సమర్పించారు. హైకోర్టు తరలింపు అంశంపై ఊహాగానాలు రావడంతో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల న్యాయవాదులు గత 10 రోజులుగా ఆయా జిల్లాల్లోని అన్ని కోర్టుల్లో విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్న విషయం విదితమే. ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఈ ఐదు జిల్లాల న్యాయవాదులు ఆందోళన స్థాయిని ఉద్యమస్థాయికి తీసుకెళ్లి ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అవకాశం లభించలేదు. దీంతో గవర్నర్‌ను కలిసి తమ గోడు వెలిబుచ్చుకోవాలని నిర్ణయించారు. ఈ అంశంపై గవర్నర్ స్పందిస్తూ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు కదా అని ప్రశ్నించినట్లు తెలిసింది. న్యాయవాదులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ప్రిసీడియం సభ్యులు చిలుకూరి నరేంద్రబాబు, సోమసాని బ్రహ్మానందరెడ్డి, నీలం రామ్మోహనరావు (గుంటూరు), బొడ్డు భాస్కరరావు (ఒంగోలు), లక్ష్మీపతి, రాజ్‌కుమార్ (విజయవాడ), అబ్బినేని విజయకుమార్ (ఏలూరు) తదితరులున్నారు. ఇలా ఉండగా తూర్పు గోదావరి జిల్లా నుండి కూడా ఈ ప్రిసీడియంకు మద్దతు లభించింది. రాజమండ్రి బార్ అసోసియేషన్ కూడా అమరావతిలోనే హైకోర్టు కొనసాగింపును సమర్థిస్తూ చేసిన తీర్మానాన్ని ప్రిసీడియంకు పంపింది. అనంతరం విజయవాడ బార్ అసోసియేషన్‌లో జరిగిన ప్రిసీడియం సమావేశంలో ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాచారం వచ్చే వరకు విధుల బహిష్కరణ కొనసాగుతుందని ఏకగ్రీవంగా తీర్మానించారు. సోమవారం నుండి విధుల బహిష్కరణతో పాటు మానవహారాలు, రిలే నిరాహరదీక్షలు వంటి నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని, ముఖ్యమంత్రిని కలిసేందుకు మరోసారి ప్రయత్నించాలని తీర్మానించారు.