క్రైమ్/లీగల్

నర్సింగ్ కాలేజీ కరస్పాండెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 20: నర్సింగ్ విద్యాసంస్థను నిర్వహిస్తున్న ఓ ప్రబుద్ధుడు తన కోర్కె తీర్చమని ఓ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటన కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో చోటు చేసుకుంది. స్థానిక మల్కాపట్నంలోని గ్రేస్ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీనర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని కరస్పాండెంట్ రమేష్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులకు గురైన సదరు విద్యార్థిని బుధవారం మచిలీపట్నం వచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వద్ద తన గోడు వెళ్లబోసుకుంది. మూడవ సంవత్సరం బీఎస్సీ చదువుతున్న తాను ఉత్తీర్ణురాలు కావాలంటే కోరిక తీర్చాల్సిందేనని కరస్పాండెంట్ రమేష్ గత మూడు నెలలుగా తనను ఒత్తిడి చేస్తున్నట్లు బాధితురాలు పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు బాధిత విద్యార్థినికి బాసటగా నిలిచి, శుక్రవారం కళాశాల వద్ద ఆందోళన చేశారు. కరస్పాండెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్‌పేట సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కరస్పాండెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.