క్రైమ్/లీగల్

కలుషితాహారంతో 70 మంది విద్యార్థినులకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురవాడ, సెప్టెంబర్ 20: విశాఖ జిల్లా మధురవాడలోని చైతన్య కళాశాల హాస్టల్‌లో కలుషిత ఆహారం కారణంగా సుమారు 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడంతో స్థానిక ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. కొమ్మాదిలోని మైత్రి భవన్‌లో శ్రీచైతన్య మహిళా కళాశాల నిర్వహిస్తున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం కూడా ఉంది. అయితే ఈ హాస్టల్‌లో వినాయక చవితి పండుగ తరువాత నుండి భోజనానికి నాణ్యమైన సరకులు వినియోగించడం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని, తినడం మానేస్తే పర్యవేక్షకులు అంగీకరించడం లేదని, దీంతో ఆ అన్నానే్న తింటున్నామని విద్యార్థినులు ఆరోపించారు. రోజూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు చదివిస్తున్నారని, దాంతో తాము తీవ్ర వత్తిడికి గురౌతున్నామని విద్యార్థినులు మీడియాకు వెల్లడించారు.
శుక్రవారం భోజనం తిన్న తరువాత సుమారు 70 మంది విద్యార్థినులు వాంతులు, కడుపునొప్పి, విరేచనాలతో బాధ పడుతుండడంతో సిబ్బంది విద్యార్థుల్లో కొంతమందిని స్థానిక ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, మరి కొంతమందికి హాస్టల్ వద్దే మధురవాడ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది వైద్యం అందజేశారు. సంఘటనా సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు, రూరల్ తహశీల్దార్ కళాశాలను సందర్శించి వివరాలు సేకరించారు. కాగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం వాస్తవమే అయినా ఎవరికీ ఎటువంటి హానీ కలగలేదని, వెంటనే వైద్యం అందించామని కళాశాల ప్రతినిధులు తెలిపారు. ఇదిలా ఉండగా సంఘటన గురించి తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్ నుండి తీసుకెళ్తున్నారు. వేలాది రూపాయిలు ముక్కుపిండి వసూలు చేస్తున్న యాజమాన్యం నాణ్యతలేని భోజనం పెట్టడం పట్ల విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.