క్రైమ్/లీగల్

జీవితంపై విరక్తితో కుటుంబ సభ్యులతో హోంగార్డు అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, సెప్టెంబర్ 22: పలు సమస్యలతో సతమతమవ్వడమే కాకుండా సమాజంలో పరువుపోతోందనే ఆవేదనతో పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డు తన భార్యా పిల్లలతో సహా అదృశ్యమైన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలకేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. సంచలనం కలిగించిన ఈ ఉదంతాన్ని ఛేదించేందుకు పోలీసుశాఖ రంగంలోకి దిగింది. అయితే అదృశ్య సంఘటనపై అటు హోంగార్డు తల్లిదండ్రులు, పోలీసు శాఖలు వెల్లడిస్తున్న వివరాలకు పొంతన లేకుండా ఉన్నాయి. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలకేంద్రానికి చెందిన కటకం రవి మద్దిరాల పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. భార్య పద్మతోపాటు ఆయనకు ముగ్గురు కుమార్తెలు. కాగా గత ఏడాది మద్దిరాల మండలకేంద్రానికి చెందిన వ్యక్తితో తన మొదటి కుమార్తె చందననిచ్చి వివాహం జరిపించారు. అయితే పెళ్లి జరిగిన కొద్దిమాసాలకే కుమార్తె చందన పలు కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వివిధ కార్యకలాపాల పరంగా అల్లుడితో రవికి పలు విభేదాలు ఏర్పడినట్టు తెలిసింది. అప్పటి నుండే రవి మానసికంగా కృంగిపోతూ అనేక సమస్యలతో భాదపడుతున్నట్టు చెబుతున్నారు. కాగా ఆదివారం ఉదయం రవి మూడు పేజీల ఉత్తరం రాసి పెట్టి ఇంటికి తాళం వేసి భార్య పద్మ, కూతుళ్ళు సింధు, స్పందనతో అదృశ్యమయ్యారు. విషయం తెలుసుకున్న తుంగతుర్తి సీఐ అయోధ్య, ఎస్‌ఐ శ్రీకాంత్ సంఘటనా స్దలానికి వెళ్లి ఇంటి తాళాలు పగులగొట్టి ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. సెల్ సిగ్నల్ ఆధారంగా తహశీల్దార్ కార్యాలయం వెనుక వరకే రవి కుటుంబం వెళ్లినట్టు పోలీసులు గ్రహించారు. విషయం తెలియగానే సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు, నాగారం సీఐ తుల శ్రీనివాస్ తుంగతుర్తికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎస్‌ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి ఉమ్మడి వరంగల్, నల్లగొండ, హైదరాబాద్ తదితర జిల్లాలలో గాలింపు చేపట్టాయి. వివిధ ప్రాంతాలో రవికి ఉన్న బంధువులు, స్నేహితుల వద్ద అతని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.
*చిత్రాలు.. అదృశ్యమైన హోంగార్డు కటకం రవి కుటుంబం (ఫైల్ ఫొటో)
*హోంగార్డు రవి రాసిపెట్టిన లేఖను చూస్తున్న డీఎస్పీ నాగేశ్వర్‌రావు