క్రైమ్/లీగల్

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, ఏప్రిల్ 14: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదన్న మనస్థానంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొప్పాని తేజ (18) నల్లగొండ ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. పరీక్షల్లో ఉత్తీర్ణత కాకపోవడంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ గోవర్థన్ తెలిపారు.