క్రైమ్/లీగల్

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, ఏప్రిల్ 14: ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయన్న తీవ్ర మనస్తాపంతో ఓ విద్యార్థిని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మక్తల్ మండలం కర్ని గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే మండల పరిధిలోని కర్ని గ్రామానికి చెందిన నాగేశమ్మ, మల్లేష్‌గౌడ్‌లకు కూతురు మమత. ఆమె జిల్లా కేంద్రంలోని వాగ్ధేయి కళాశాలలో ఇంటర్ ప్రథమంలో ఎంపీసీ చదువుతోంది. ఇంటర్ ఫలితాల్లో మమత 470 మార్కులకుగాను 435 మార్కులతో ‘ఏ’ గ్రేడ్‌లో 75 శాతం మార్కులతో పాసైంది. కాగా తన స్నేహితులకు 460కి పైగా మార్కులు రావడం, తనకు 435 మార్కులే వచ్చాయని తీవ్ర మనస్తాపానికి గురైన మమత శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో తాడుతో ఇంటి పైకప్పునకు ఉరేసుకుంది. ఎన్ని మార్కులు వచ్చాయని కూడా అడుగలేని తమకు కడుపుకోత మిగిల్చిందంటూ తల్లిదండ్రులు గుండెలు బాదుకొని విలపించిన తీరు అక్కడకి వచ్చిన అందరి హృదయాలను కలచి వేసింది. మంచి మార్కులతో పాసై కూడా ఎందుకు ఇంతటి పనికి ఒడిగట్టావు తల్లీ అంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మల్లేష్‌గౌడ్‌డుకు ఒక కూతురు, ఓ కుమారుడు ఉన్నారు.