క్రైమ్/లీగల్

రైలు ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్లదినె్న, ఏప్రిల్ 15 : మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో ఆదివారం రైలు ఢీకొని చాకలి బాలన్న (68) మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు కల్లూరు గ్రామంలో చాకలి బాలన్న తన కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈనేపథ్యంలో గాడిదలు రైల్వే పట్టాలపై రావడంతో పక్కనకు తోలేందుకు వెళ్లడంతో రైలు ఢీకొంది. దీంతో బాలన్న అక్కడిక్కడే మృతి చెందాడు. అదేవిధంగా రెండు గాడిదలు మృతి చెందాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
మహిళ ఆత్మహత్య
యాడికి, ఏప్రిల్ 15 : మండల కేంద్రంలోని ఆసుపత్రి కాలనీకి చెందిన నరసింహులు భార్య వెంకటలక్ష్మి (30) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నరసింహులు, వెంకటలక్ష్మి దంపతులకు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అయితే వెంకటలక్ష్మి ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో శనివారం రాత్రి భర్త మిద్దెపై పడుకోవడం చూసి, ఇంట్లో కుమారుడితో నిద్రిస్తున్న ఆమె అర్ధరాత్రి దూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారి బయట పాల కోసం వెళ్లి అమ్మ ఊయల ఊగుతోందని చెప్పడంతో అందరూ నిర్ఘాంతపోయారు. వెంటనే కాలనీవాసులు భర్తను పిలిపించి ఇంట్లోకి వెళ్లగా దూలాని వేలాడుతున్నట్లు తెలిపారు. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.