క్రైమ్/లీగల్

భార్యను హత్యచేసి ఉరేసుకున్న భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు టౌన్, ఏప్రిల్ 15: కులాలు వేరైనప్పటికీ ప్రేమవివాహం చేసుకున్న ఏడు నెలలకే కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు అనుమానాస్పదంగా మృతిచెందారు. వీరిద్దరు గూడూరులోని మాయాబజార్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెంది ఉండటాన్ని స్థానికులు ఆదివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గూడూరు డిఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో పోలీసులు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ వేగవంతం చేశారు. సేకరించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బలవంపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య కుమారుడు బాలత్రినాథ్ (25) అదే జిల్లా కొత్తచెరువు మండలం కొదపగానిపల్లి గ్రామానికి చెందిన పూల కేశవ, రమణమ్మల పెద్ద కుమార్తె పూల రేణుక (22) గత ఏడు నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకొని గూడూరులోని మాయాబజారు ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. త్రినాథ్ వాషింగ్ మిషన్లు రిపేర్లు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి రేణుక తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతూ తాము మీ దగ్గరకు వస్తామని చెప్పగా అందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే శనివారం నుంచి భార్యాభర్తల ఫోన్లు పనిచేయకపోవడంతో ఆందోళన చెందిన రేణుక తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రానికి గూడూరులోని మాయబజారు ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఆ సమయానికి పోలీసులు, స్థానికులు గుమికూడి ఉండటాన్ని గమనించి ఆందోళనకు గురయ్యారు. కుమార్తె, అల్లుడు మృతిచెంది ఉండటాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా రేణుక మంచంపై రక్తపుమడుగులో పడి ఉంది. త్రినాథ్ ఇంట్లోని శ్లాబుకు ఉన్న గొళ్లేనికి తాడుతో ఉరేసుకొని మృతి చెందాడు. వీరిద్దరి మృతదేహాల తీరును చూస్తే భార్యను భర్త హత్యచేసి తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాయబజారు ప్రాంతంలో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. సంఘటనా స్థలాన్ని గూడూరు ఇన్‌చార్జి సిఐ అక్కేశ్వరరావు, 1వ, రెండో పట్టణ, రూరల్ ఎస్సైలు శేఖర్‌బాబు, హుస్సేన్, బాబిలతో కలసి మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి శవ పంచనామా కోసం మృతదేహాలను గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.