క్రైమ్/లీగల్

అన్నవరంలో రంగారెడ్డి జిల్లా దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నవరం, అక్టోబర్ 9: ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బందంగోద్ ప్రాంతానికి చెందిన శ్రీసాయిదత్త భవానీ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న ఎస్‌వీఆర్‌ఆర్ పవన్, భార్య ధనలక్ష్మితో కలిసి ఈ నెల 6వ తేదీన కారులో అన్నవరం వచ్చి స్థానికంగా ఉన్న స్నేహా రెసిడెన్సీలో గది అద్దెకు తీసుకున్నారు. మరుసటి రోజు గది అద్దె గడువును పొడిగించుకుని రెండు రోజులు గదిలోనే ఉన్నారు. మూడో రోజు ఉదయం గది నుండి వారు బయటకు రాకపోవడంతో ఉదయం 10.45 గంటలకు లాడ్జి సిబ్బంది తలుపు తట్టారు. ఎంతకూ తీయకపోయేసరికి అనుమానంతో స్థానిక పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్సై రావూరి మురళీమోహన్ తన సిబ్బందితో కలిసి గది తలుపులు తెరిచిచూసేసరికి దంపతులిరువురూ ఉరివేసుకుని మృతిచెంది ఉన్నారు. పోలీసులు గదిని క్షుణ్ణంగా పరిశీలించగా ఇరువురూ కలిసి రాసిన లేఖ లభించింది. ‘తమ చావుకు ఎవరూ బాధ్యులు కాదని, తమ తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యాపారంలో చాలా నష్టపోయామని, ఆర్థిక ఇబ్బందులు తమను మరింత కుంగదీశాయని, అందరూ చెప్పినట్టు వింటే తమకు ఈపరిస్థితి వచ్చి ఉండేదికాదని, తమ కొడుకును ఒంటరిగా వదిలి వెళుతున్నందుకు చాలా బాధగా ఉందని, కొడుకు బాధ్యతను ఎవరో ఒకరు తీసుకోవాలని పవన్ రాశారు. ‘వేరే దారిలేక ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ మీద కోపాన్ని తమ కొడుకు మీద చూపించవద్దని, తాము చేసిన అప్పులతో ఎవరికీ సంబంధంలేదని’ భార్య ధనలక్ష్మి లేఖలో పేర్కొంది. స్థానిక వీఆర్వో అచ్యుతం సమక్షంలో మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని అన్నవరం ఎస్సై రావూరి మురళీమోహన్ తెలిపారు.

*చిత్రం... ఉరివేసుకున్న దంపతులు