క్రైమ్/లీగల్

రూ. 34 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, ఏప్రిల్ 16: అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 34 లక్షల రూపాయల విలువైన గంజాయిని సోమవారం ట్రైనీ ఎస్పీ వై రిశాంత్‌రెడ్డి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లకు వివరాలు తెలియచేస్తూ విశాఖ జిల్లా పాడేరు నుండి తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా భట్లగుండు గ్రామానికి కార్లలో నలుగురు వ్యక్తులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో రెండు కార్లను వెంబడించి దేవరపల్లి సమీపంలో పట్టుకుని సుమారు 114 ప్యాకెట్లలో గల సుమారు 34 లక్షల రూపాయల విలువైన 228 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులైన ఆనందం శివస్వామి, దళపాణి, సంగీత్‌కుమార్, రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. భట్లగుండు గ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి జమీర్‌బాయ్ ఒక్కొక్కరికి యాభై వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. పాడేరుకు చెందిన కాంట్రాక్టరు రాము వద్ద నుండి గంజాయి తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రిషాంత్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో కొవ్వూరు సీఐ శరత్‌రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.