క్రైమ్/లీగల్

ఏసీబీ కస్టడీకి ఈఎస్‌ఐ నిందితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన వారిలో ఏడుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుంది. ఈ కేసులో నిందితులకు రెండు రోజుల కస్టడీ విధించడానికి ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. దీంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురిని ఏసీబీ బుధవారం కస్టడీలోకి తీసుకుంది. వీరిని బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో రెండు రోజుల పాటు విచారించనున్నారు. కస్టడీకి తీసుకున్న వారిలో ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికా రాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మజ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఫార్మాసిస్ట్ రాధిక, ఫార్మా కంపెనీ ప్రతినిధులు శ్రీహరి, నాగరాజు, హర్షవర్దన్ ఉన్నారు. ఏసీబీ సోదాల్లో భాగంగా అరవింద్‌రెడ్డి ఆఫీసులో దొరికిన డాక్యుమెంట్ల గురించి నిందితులను ఏసీబీ విచారిస్తోంది. దేవికారాణితో పాటు నిందితులను విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. సోదాల్లో అరవింద్‌రెడ్డి కార్యాలయంలో దొరికిన పత్రాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. విచారణలో నిందితులిచ్చే సమాచారంతో మరికొంత మందిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. ఈ స్కాంలో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సంచలన సృష్టించిన మందుల కుంభకోణం కేసులో మరి కొంతమందిని ఏసీబీ అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిసింది.
*దేవికా రాణి (ఫైల్ ఫొటో)

ఆంధ్రభూమి బ్యూరో