క్రైమ్/లీగల్

దళిత దివ్యాంగురాలుపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, ఏప్రిల్ 16: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పశువా ఘటనా మరువకముందే జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో మరోధారుణం చోటుచేసుంది. సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. పీటీసీ దగ్గరిలోని ఓ పైవేటు లే-అవుట్‌లో ఈ సంఘటన జరగడం ధారుణం. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం పూసపాటిరేగ మండల కేంద్రం దళిత కాలనీకి చెందిన దివ్యాంగురాలు 21సంవత్సరాల యువతిపై ఆదివారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. బాధితరాలు పూసపాటిరేగ నుంచి పూల్‌బాగ్ కాలనీ తన అక్క ఇంటికి వెళ్ళడానికి కోట వద్ద రాత్రి 6.30గంటలకు షేరు ఎక్కింది. బాధితరాలు దివ్యాంగురాలు కావడంతో తన అక్క ఇంటి వద్దే దించాలని ఆటోడ్రైవర్‌ను కోరింది. ఆటోలో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారు. ఆ ఇద్దరు దుండగులు బాధితురాలు నోటిలో గుడ్డకుక్కి బలవంతంగా పూల్‌బాగ్ కాలనీ దాటించి సారిపల్లి పారిశ్రామిక ప్రాంతానికి తీసుకువెళ్ళి ఓ ప్రైవేటు లే-అవుట్‌లో అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో అదే ప్రాంతం గుండా సైకిల్‌పై వెళుతున్న వ్యక్తి బాధితురాలు అరుపులు విని సంఘటనా స్థలానికి వెళ్ళడంతో నిందితులు బాధితురాలును విడిచిపెట్టి ఆటోతో పరారయ్యారు. సంఘటన జరిగిన తరువాత బాధితురాలు తన స్వగ్రామం పూసపాటిరేగ వెళ్ళి జరిగిన సంఘటనను బంధువులకు వివరించి బోరున విలపించింది. దీంతో పూసపాటిరేగ పిహెచ్‌సికి బంధువులు బాధితురాలుని తీసుకువెళ్ళగా అక్కడి నుంచి జిల్లా కేంద్ర ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ పాలరాజు, డిఎస్పీ ఎ.వి.రమణ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ డిఎస్పీ త్రినాథ్, రూరల్ సిఐ లక్ష్మణరావు, రూరల్ ఎస్సైలు హెచ్. ఉపేంద్రరావు, రవికుమార్‌లు పరిశీలించారు. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.