క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 16: నగరంలోని దండివీధికి చెందిన గొర్లె చంద్రశేఖర్(45) అనుమానస్పదంగా మృతి చెందాడు. మృతుడు ఆదివారం రాత్రి 2గంటల వరకు ఇంటిలోనే ఉన్నాడని వేకువజామున 5గంటలకు చూసేసరికి ఇంటి సందులో విగతజీవిగా ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే పరిశీలించగా మృతిచెందినట్లు నిర్దారించారు. అయితే మృతికి గల కారణాలు తెలియరాలేదు. 1వ పట్టణ పోలీస్‌స్టేషన్ సి ఐ ప్రసాదరావు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టంనిమిత్తం రిమ్స్‌కు తరలించారు.