క్రైమ్/లీగల్

ప్రధాని మోదీ సోదరుని కుమార్తె పర్సును లాక్కెళ్లిన దొంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: నిత్యం చైన్ స్నాచింగ్‌లతో హడెలెత్తిస్తున్న చైన్ స్నాచర్లు శనివారం ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సోదరుని కుమార్తె దమయంతి బెన్ మోదీ చేతిలో నుంచి పర్సును లాక్కెళ్ళారు. ఆటో రిక్షా కోసం వేచి చూస్తున్న దమయంతి వద్దకు ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి, ఆమె చేతిలోని పర్సును లాక్కుని పారిపోయారు. ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కుమార్తె దమయంతి బెన్ మోదీ శనివారం ఉదయం 7 గంటలకు అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఆమె ఆటోరిక్షా కోసం నిరీక్షించిన సమయంలో ఈ ఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని ఆయన చెప్పారు. సీసీ పుటేజీలు పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. ఆమె పర్సులో మొబైల్ ఫోను, కొన్ని డాక్యుమెంట్లు, విలువైన ఇతర వస్తువులు ఉన్నాయని పేర్కొన్నారు. దమయంతి శనివారం సాయంత్రం విమానంలో అహ్మదాబాద్ వెళ్ళిల్సి ఉంది.