క్రైమ్/లీగల్

తుది దశకు ‘అయోధ్య’ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: సుదీర్ఘ కాలం నుంచి సాగుతున్న అయోధ్య స్థల వివాదం కేసు విచారణ సోమవారం తుది దశలోకి చేరుకుంటుంది. రామజన్మభూమి- బాబరీ మసీదు వివాదాస్పద స్థలం కేసు విచారణను సుప్రీంకోర్టు వారం రోజుల దసరా సెలవుల తరువాత 38వ రోజు సోమవారం తిరిగి ప్రారంభిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు ఆరో తేదీ నుంచి రోజువారీ విచారణను ప్రారంభించింది. ఈ స్థల వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి చేపట్టిన మధ్యవర్తిత్వ ప్రక్రియ విఫలం కావడంతో సుప్రీంకోర్టు కేసు రోజువారీ విచారణకు పూనుకుంది. అక్టోబర్ 17వ తేదీనాటికి విచారణను పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు నిర్ణయించింది. నాలుగు సివిల్ దావాలను విచారించిన అలహాబాద్ హైకోర్టు అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని మూడు పక్షాలు- సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్‌లల్లాలకు సమంగా పంచాలని 2010లో తీర్పు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ 14 అప్పీళ్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ స్థలానికి సంబంధించి తొలుత దిగువ కోర్టులో అయిదు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గోపాల్ సింగ్ విశారద్ అనే ‘రామ్ లల్లా’ భక్తుడు 1950లో తొలి వ్యాజ్యం దాఖలు చేశారు. వివాదాస్పద స్థలంలో హిందువులకు ఉన్న ప్రార్థనలు చేసుకునే హక్కును అమలు చేయాలని ఆయన ఆ పిటిషన్‌లో కోరారు.
అదే సంవత్సరం పరమహంస రామచంద్ర దాస్ అనే వ్యక్తి మరో పిటిషన్ దాఖలు చేశారు. హిందువులు ప్రార్థనలు చేసుకోవడాన్ని కొనసాగించాలని, వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేయడానికి ముందు ఉన్న సెంట్రల్ డోమ్ కింద విగ్రహాలు ఉంచడానికి అనుమతి ఇవ్వాలని దాస్ తన పిటిషన్‌లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.