క్రైమ్/లీగల్

దినె్నవదేవరపాడులో విషాదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 16:కర్నూలు గ్రామీణ మండల పరిధిలోని దినె్నదేవరపాడులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అయిదుగురు సభ్యుల కుటుంబం సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బోయ చిన్న మద్దిలేటి అలియాస్ మధు(30) అతడి భార్య లంకేశ్వరి, ముగ్గురు పిల్లలు వౌనిక, వంశీ, చిట్టిలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వారిలో మద్దిలేటి కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించగా, భార్య, ముగ్గురు పిల్లలు వైద్యుల పర్యవేక్షణలో మృత్యువుతో పోరాడుతున్నారు. దినె్నదేవరపాడు గ్రామంలో నివాసం ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ ఉపాధి పొందుతున్న మద్దిలేటి ఇటీవలే ఒక ఇంటిని నిర్మించుకున్నాడు. ఇంటి నిర్మాణ సమయంలో అప్పులు కావడం, సరైన ఉపాధి లేక అప్పులు భారంగా పరిణమించాయి. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. ఈ పరిస్థితుల్లో అప్పుల విషయమై భార్యతో గత కొంత కాలంగా వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయని పోలీసుల విచారణలో తేలింది. ఇదే క్రమంలో సోమవారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య వివాదం నెలకొనగా ఇద్దరూ పురుగుల మందు తాగారు. తాము చనిపోతే పిల్లలు అనాథలవుతారని వారికి కూడా పురుగుల మందు తాపడంతో కుటుంబం మొత్తం అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ మద్దిలేటి అలియాస్ మధు మరణించగా భార్య లంకేశ్వరి, పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారు కోలుకునే విషయమై ఇపుడే ఏమీ చెప్పలేమని వైద్య సేవలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.