క్రైమ్/లీగల్

రెండు రోజుల్లో తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: చర్చించుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చని, ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చొరవ చూపాలని హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ప్రభుత్వానికి సూచించింది. 18న సానుకూల నివేదికతో రావాలని స్పష్టం చేసింది. సమ్మె సమస్యపై పలు పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు ధర్మాసనం ఇరుపక్షాల వాదనలనూ విచారించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి గతంలో సమర్పించిన నివేదిక సమగ్రంగా లేదని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో సర్కారు మంగళవారం మరో కౌంటర్‌ను దాఖలు చేసింది. సమ్మె ప్రభావం ప్రజలపై లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది. దీనిపై కోర్టు స్పందిస్తూ, అదే జరిగితే, విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీకి మేనేజింగ్ డైరెక్టర్ లేరని తెలుసుకున్న హైకోర్టు తక్షణం ఎండీని నియమించాలని ఆదేశించింది. మరో పక్క కార్మికులు పండగ సమయంలో నిరసనలకు దిగితే ఎస్మా ఎందుకు ప్రయోగించరాదో చెప్పాలని ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. ఆర్టీసీ సమ్మెపై విచారణ చేపట్టిన హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లో సమ్మెపై కోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. ఈనెల 18లోగా చర్చలు ముగించి సానుకూల వార్తతో రావాలని హైకోర్టు తెలిపింది. తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని కార్మికులను కోరింది. ప్రభుత్వ తీరుపై హైకోర్డు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్ల పట్టుదల మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణలో భాగంగా హైకోర్టు ఇటు ప్రభుత్వానికి, అటు యూనియన్ల తరఫున హాజరైన న్యాయవాదులకు పలు ప్రశ్నలు సంథించింది. కార్మికులు నిరసన తెలిపేందుకు అనేక మార్గాలున్నాయని ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొంది. అలాగే ఆర్టీసీ సమ్మె విరమిచేలా చేసేందుకు తీసుకున్న చర్యలను వివరించాలని ప్రభుత్వాన్ని నిలదీసింది. కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ చేసినట్టు ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగా మరోపిటిషన్‌లో కార్మికులకు వేతనాలు చెల్లించలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆర్టీసీ జేఏసీ తరఫున న్యాయవాదులు ఆరోపించారు. సమ్మె విరమిస్తే తమ సమస్యలు ఎన్నటికీ పరిష్కారం కావని అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఆర్టీసీని విలీనం చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీని విలీనం చేస్తే మరికొన్ని కార్పొరేషన్లు కూడా అదే డిమాండ్‌తో ముందుకు వస్తాయని పేర్కొంది.
జీతాల పిటిషన్‌పై
విచారణ నేటికి వాయిదా
ఆర్టీసీ ఉద్యోగుల జీతాలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది. 49,190 మంది ఆర్టీసీ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. సెప్టెంబర్ నెల జీతాలు ఇప్పటికీ చెల్లించలేదని పిటిషనర్ పేర్కొన్నారు.