క్రైమ్/లీగల్

అప్పులబాధతో యువ రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి, ఏప్రిల్ 16: సాగునీటి వసతి మృగ్యంగా మారి కళ్లెదుటే పంట ఎండిపోవడాన్ని చూసిన ఓ యువరైతు, అప్పులు తీర్చే మార్గం కానరాక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన దర్పల్లి మండలం గోవింద్‌పల్లిలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన డీ.రాకేష్(19) అనే యువకుడు తన తండ్రి సేద్యాన్ని పట్టించుకోకపోవడంతో తానే పంటలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుత రబీ సీజన్‌లో తనకున్న రెండెకరాల పొలంలో అప్పులు చేసి మరీ వరి పంట వేశాడు. అయితే బోరుబావి వట్టిపోయి సాగునీరందక పంట ఎండిపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కొన్ని రోజుల నుండి ఇంట్లో మధనపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన రాకేష్, గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం పశువుల కాపర్లు శవాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం అందించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు శవ పంచనామా జరిపి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు.