క్రైమ్/లీగల్

జోగిపేటలో ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగిపేట, అక్టోబర్ 15: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం పక్కన గల కార్యాలయంలో ఉప కోశాధికారి దేవేందర్, సీనియర్ అకౌంటెంట్ జయప్రకాశ్ లను రిటైర్డ్ ఉపాధ్యాయుడు సంగమేశ్వర్ నుంచి ఎనిమిది వేల రుపాయల లంచం తీసుకుంటుండగా సంగారెడ్డి అవినీతి శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రిటైరైన ఉపాధ్యాయులు సంగమేశ్వర్‌కు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి కోసం లంచాలు అడగటం, కార్యాలయం చుట్టు తిరిగినా పని కాకపోవడంతో విసుగుచెంది వారు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. దీంతో అధికారులు మాటు వేసి ఎనిమిది వేల రుపాయల లంచం తీసుకుంటున్న ఇద్దరు అధికారులను పట్టుకున్నారు. పట్టుబడ్డ దేవేందర్, జయప్రకాశ్‌లపై అవినీతి శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.