క్రైమ్/లీగల్

సర్కారుకు మరో దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించగా, ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బతగిలింది. సెప్టెంబర్ నెల జీతా లు చెల్లించకపోవడంతో కార్మికులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం నాడు విచారణ జరిగింది. జీతాలు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి జీతాలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో న్యా యస్థానం ఆర్టీసీ యాజమాన్యం తీరు ను నిలదీసింది. సిబ్బంది మొత్తం స మ్మెలో కొనసాగుతున్నారని ఈ దశలో జీతాల చెల్లింపు సాధ్యం కాదని ప్రభు త్వ కౌన్సిల్ వాదించగా, అవసరమైతే వంద మంది సిబ్బందిని ఏర్పాటు చే స్తామని కార్మికుల తరఫున న్యాయవా ది పేర్కొన్నారు. దాంతో సోమవారం లోగా సిబ్బందికి వేతనాలు చెల్లించాలని హైకోర్టు ఆర్టీసీని ఆదేశించింది. కోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆర్టీసీ కార్మికుల తో చర్చించి సమ్మె విరమణకు చర్యలు చేపట్టాలని హైకోర్టు సూచించడంతో ప్రభుత్వం ఆ దిశగా బుధవారం చర్య లు ప్రారంభించింది. కేసు తదుపరి వి చారణను 21కి వాయిదా వేసింది.
సమ్మె, ఎండీ నియామకంపై సమీక్ష
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం హైకోర్టు కు సమర్పించే నివేదిక, అలాగే ఆర్టీసీకి ఎండీ నియామకంపై సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావే శం నిర్వహించారు. రవాణాశాఖ మంత్రి పువ్వా డ అజయ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ సుల్తానీయా సమావేశానికి హాజరయ్యారు. సమ్మెపై కార్మికులతో చర్చలు జరపడం తో పాటు ఎండీని నియమించాలని ప్ర భుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విష యం తెలిసిందే. దీనిపై హైకోర్టుకు ప్ర భుత్వం శుక్రవారం నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ రెండింటీపై సీఎం చర్చించినట్టు తెలిసింది. ఆర్టీసీ ఎండీ గా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, అకున్ సభర్వాల్, స్టీఫెన్ రవీంద్ర పేర్లు పరిశీలనలో ఉన్న ట్టు తెలిసింది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు, ఎండీ నియామకంపై గు రువారం అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం.