క్రైమ్/లీగల్

పీఎంసీ కేసు అత్యవసర విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: పంజాబ్, మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు(పీఎంసీ) ఖాతాదారులకు రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. పీఎంసీలో 4,355 కోట్ల రూపాయల కుంభకోణం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పీఎంసీపై రిజర్వ్ బ్యాంక్ విత్‌డ్రాలపై ఆంక్షలు పెట్టింది. కుంభకోణం, ఆంక్షల వల్ల 15 లక్షల మంది సొమ్ములు నిలిచిపోయాయని బిజోన్ కుమార్ మిశ్రా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఖాతాదారుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని అత్యవసరంగా విచారణకు స్వీకరించాలన్న మిశ్రా అభ్యర్థనను సుప్రీం కోర్టు మన్నించింది. పీఎంసీ కుంభకోణం వల్ల ఖాతాదారులు తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీకి చెందిన మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎన్‌వీ రమణ, ఆర్ సుభాష్‌రెడ్డి, బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం విచారణకు అనుమతించింది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెకి, ఖాతాదారులకు భరోసా కల్పించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దేశంలోని సహకార బ్యాంకులు, జాతీయ బ్యాంకుల్లో ఇలాంటి కుంభకోణాలు తలెత్తినప్పుడు ఖాతాదారులకు సొమ్ములకు బీమా కల్పించాలని బిజోన్ కుమార్ మిశ్రా కోరారు. ఈమేరకు కేంద్రం, ఆర్‌బీఐకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. బ్యాంకులో కుదువబెట్టిన డిపాజిటర్ల సొమ్ములకు వంద శాతం బీమా ఉండేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. అన్ని సహకార బ్యాంకులు పనితీరును పర్యవేక్షించేందుకు వీలుగా పూర్తిస్థాయి అధికారాలతో కూడిన ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సహకార బ్యాంకుల పట్ల సామాన్య జనంలో విశ్వాసాన్ని పాదుగొల్పేందుకు పారదర్శకతతో కూడిన యంత్రాంగం ఉండాలని పిటిషన్‌లో సూచించారు. పీఎంసీ బ్యాంకు విత్‌డ్రాలపై ఆర్‌బీఐ విధించిన ఆంక్షలను ఎత్తివేసేలా ఆదేశాలివ్వాలని మిశ్రా బెంచ్‌ను అభ్యర్థించారు. పీఎంసీలో కుంభకోణం వల్ల వేలాది మంది అమాయక డిపాజిటర్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఎంసీ సంక్షోభం ఇద్దరు ఖాతాదారులు ఉసురు తీసింది. ముంబయిలో మంగళవారం ఓ ఖాతాదారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే సొమ్ములు తిరిగి ఇవ్వాలని బ్యాంకు ఎదుట ఆందోళన చెపట్టిన ఓ ఖాతాదారుడు గుండెపోటుతో మృతి చెందారు.