క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి యువకుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్రాబాద్, ఏప్రిల్ 16: మండల పరిధిలోని ఈదులబావి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయైన విషాధ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పదర మండల కేంద్రానికి చెందిన నెల్లికంటి గణేష్ (25), నెలికంటి మురళి (14) అన్నదమ్ముల పిల్లలు అచ్చంపేటలోని బంధువుల ఇంటిలో జరిగే ఓ కార్యక్రమానికి టీఎస్ 07 ఎఫ్‌వై 6264 అనే బైకుపై వీరిద్దరు వెళ్తుండగా ఈదులబావి గ్రామ సమీపంలోని మలుపు వద్ద అమ్రాబాద్ వైపు నుండి వస్తున్న ఇటుకల లారీ (ఏపీ 07 యూ 1265)ని వేగంగా ఢీకొనడంతో బైకు నడుపుతున్న గణేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున మురళికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స చేయించే క్రమంలో మృతి చెందాడని స్థానిక సీఐ రమేష్ కొత్వాల్ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. మృతులిద్దరు అవిహహితులు. గణేష్ హైద్రాబాదులో వెల్డింగ్ పని చేస్తాడు. మురళి పదర మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతిని పూర్తి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనతో పదరలో విషాధఛాయలు అలుముకున్నాయి.