క్రైమ్/లీగల్

లోయలో పడిన పశువుల కంటైనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు: అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్ ప్రమాదశాత్తు లోయలో పడడంతో కంటైనర్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 14 పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై నీలకంఠం అందించిన వివరాల ప్రకారం ఒడిశా నవరంగ్‌పూర్ నుంచి సీలేరు మీదుగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్ సీలేరు జల విద్యుత్ కేంద్రం సమీపంలో గురువారం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో కంటైనర్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 14 పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటనతో సమీపంలోని పార్వతీనగర్ గ్రామస్థులు, స్థానిక యువకులు కంటైనర్ వెనుక భాగాన్ని పగులగొట్టారు. తెరిచి చూసే సరికి లోపల పశువులతో పాటు ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. కాగా కంటైనర్ డ్రైవర్, పరారైనట్లు తెలిపారు. పరిమితికి మించి కంటైనర్‌లో పశువులను తరలించడం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా ప్రదేశానికి పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నీలకంఠం తెలిపారు.

*చిత్రం... లోయలో పడిన పశువుల కంటైనర్