క్రైమ్/లీగల్

రవిప్రకాష్‌పై ఎన్ని కేసులున్నాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: టీవీ -9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై నమోదైన కొత్త కేసుపై అతని తరఫున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి సీరియస్ అయ్యారు. ఒక మనిషిని ఎంతలా హింస పెడతారు అంటూ ప్రశ్నించారు. రవిప్రకాశ్‌ను ఎంతకాలం జైలులో ఉంచుతారని ప్రశ్నించారు. పోలీసులు న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయవద్దని అలా చేస్తే సీనియర్ అధికారులను కోర్టుకు పిలిపించాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు. రవిప్రకాష్‌పై ఇంత వరకూ ఎన్ని కేసులు నమోదు చేశారో సమగ్ర నివేదికతో మంగళవారం నాడు రావాలని ఆమె ఆదేశించారు.
కాగా మరో పక్క నకిలీ ఐడీ తయారు కేసులో రవిప్రకాష్‌ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది. రవిప్రకాష్‌కు ఇదే కేసులో కూకట్‌పల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధంచగా ఆయన చంచల్‌గూడ జైలో ఉన్నారు. ఐ విజన్ కంపెనీకి చెందిన ఉద్యోగిగా నటరాజ్ పేరు మీద రవిప్రకాష్ నకిలీ ఈ మెయిల్ ఐడీని తయారుచేశారని గుర్తించిన ఐల్యాబ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవిప్రకాష్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన టీవీ 9 ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్‌లకు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్నారు.