క్రైమ్/లీగల్

విలేఖరులపై దాడుల పట్ల విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 18: రాష్ట్రంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులను ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ భరోసా ఇచ్చారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యుజే నేతలు డీజీపీ సవాంగ్‌ను కలిసి జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో పాత్రికేయుడు సత్యనారాయణ హత్య, శ్రీకాకుళం జిల్లా జులుమూరులో విలేఖరి కరుణవీరుడిపై జరిగిన దాడిపై పోలీసుల దర్యాప్తు సరిగాలేదని వివరించారు. దీనిపై స్పందించిన డీజీపీ మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేసే అధికారులను మార్పు చేస్తామని, సత్యనారాయణ హత్య కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యుడు సురేష్, ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు పాల్గొన్నారు.