క్రైమ్/లీగల్

బాణసంచా ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 18: తూర్పు గోదావరి జిల్లాలో మరో భారీ బాణసంచా ప్రమాదం సంభవించింది. తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని జి వేమవరంలోని శివపార్వతి బాణసంచా తయారీ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం సంభవించిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగావుంది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఏనిమిది మందికి జిల్లా కేంద్రం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వివరాలిలావున్నాయి.... గ్రామంలోని ఒక రేకుల షెడ్డులో నిర్వహిస్తున్న శివపార్వతి బాణసంచా తయారీకేంద్రంలో శుక్రవారం 11మంది కార్మికులు బాణాసంచా తయారుచేస్తున్నారు. సాయంత్రం సమయంలో చిచ్చుబుడ్లు తయారుచేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో తయారీలో పాల్గొన్న వారందరూ మంటల్లో చిక్కుకుని గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ఎర్రంనీడి కృష్ణమూర్తి, ఎర్రంనీడి నాగబాబు, ఎర్రంనీడి సత్యం, ఎర్రంనీడి బ్రహ్మం, లీలావెంకటేష్, సత్యనారాయణ, రామకృష్ణ, గోవిందులును కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కృష్ణమూర్తి, నాగబాబు పరిస్థితి విషమంగావుందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే కోరంగి పోలీసులు సంఘటనా స్ధలానికి చేరి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాకినాడ డిఎస్పీ కె కుమార్ మాట్లాడుతూ ప్రమాదంపై కోరంగి పోలీసులు కేసు నమోదుచేశారన్నారు. దర్యాప్తు జరుపుతున్నామని, పూర్తిస్థాయిలో సమాచారం అందాక, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ జగన్నాథపురం అగ్నిమాపక కేంద్రం అధికారిని ప్రశ్నించగా తమకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని, ప్రమాదం జరిగినట్లుగా తెలిసిందని చెప్పడం గమనార్హం. శివపార్వతి ఫైర్‌వర్క్స్‌కు అనుమతి ఉందా, బాణాసంచా కేంద్రాన్ని ఇటీవల తనిఖీ చేశారా అని ప్రశ్నించగా రికార్డులు చూస్తేగానీ ఏ విషయం చెప్పలేనని పేర్కొన్నారు.