క్రైమ్/లీగల్

రూ. 10 లక్షలు లంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆయన కుమారుడు కార్తీ, కొందరు ప్రభుత్వ అధికారులు సహా మొత్తం 14 మందిపై సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఆర్థిక మంత్రిగా చిదంబరం తన అధికార హోదాను దుర్వినియోగం చేసి ఐఎన్‌ఎక్స్ మీడియా, ఐఎన్‌ఎక్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ముడుపులకు బదులుగా అనుమతించారని సీబీఐ పేర్కొంది. ఇందు కోసం ఆయన 2008లో 9 లక్షల 96 వేల రూపాయల ముడుపులు తీసుకున్నారని తెలిపింది. చిదంబరం బెయిల్ పిటీషన్‌పై సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిన రోజునే ఆయన మరి కొందరిపై సీబీఐ దిగువ కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేయడం గమనార్హం. ఈ ఛార్జీ షీట్‌లో కార్తీ చార్టెడ్ అకౌంటెంట్ భాస్కర రామన్ అప్పటి ఐఎన్‌ఎస్ మీడియా లిమిటెడ్ డైరెక్టర్ పీటర్ ముఖర్జీ, అలాగే ఐఎన్‌ఎక్స్ మీడియా మాజీ ప్రమోటర్ ఇంద్రాణీ ముఖర్జీల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఇంద్రాణీ ముఖర్జీ పేరు ఇందులో చేర్చినప్పటికీ ఆమెపై ఎలాంటి అభియోగాలు దాఖలు కాలేదు. ఈ కేసులో ఇప్పటికే ఆమె అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా జైలులోనే ఉన్న చిదంబరం ప్రస్తుతం ఓ మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కస్టడీలోకి వచ్చారు. సంబంధిత కోర్టు న్యాయమూర్తి శుక్రవారం అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక న్యాయమూర్తి లాల్ సింగ్ ముందు సీబిఐ ఈ ఛార్జీ షీట్ దాఖలు చేసింది. ఈ నెల 21న ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహర్ దీనిపై విచారణ చేపడతారు. భారత శిక్షాస్మృతిలోని 120బి నేర పూరిత కుట్ర, 420 (్ఛటింగ్), 468 (్ఛటింగ్ చేసే ఉద్దేశంతో ఫోర్జరీ), 471 (నకిలీ పత్రాలను అసలుగా ఉపయోగించడం) సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదైంది. అలాగే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్-9 కింద కూడా కేసును దాఖలు చేశారు. ఈ కేసుల్లో నిందితుల నేరం రుజువైతే గరిష్ట స్థాయిలో ఏడేళ్ళ జైలు శిక్ష పడుతుంది.
ఇదిలాఉండగా చిదంబరం బెయిల్ పిటీషన్‌ను సీబీఐ శుక్రవారం సుప్రీం కోర్టులో తీవ్రంగా వ్యతిరేకించింది. చిదంబరం, ఆయన కుమారుడు కార్తీక్ సహా పలువురిపై దాఖలైన ఛార్జీషీట్ గురించి కోర్టుకు తెలిపింది. చిదంబరానికి బెయిల్ మంజూరు చేసినట్లయితే ఆయన దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని, అలాగే సాక్షులను కూడా ప్రభావితం చేస్తారని సీబీఐ తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ సాక్షి తమకు వాంగ్మూలం ఇచ్చారని, అతడి పేరు బయటపెట్టలేమని ఓ సీల్డ్ కవర్‌లో సుప్రీం కోర్టుకు తెలిపామని సీబీఐ తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అవినీతి నిరోధనలో నిస్సహన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన చిదంబరంపై దాఖలైన అభియోగాల్లో ఫోర్జరీ కేసు కూడా ఉందని అన్నారు. సీబీఐ వాదనను చిదంబరం తరఫు సీనియర్ న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇప్పటికే చిదంబరం పాస్ పోర్టు జప్తు చేశారు. లుక్ అవుట్ నోటీసు కూడా జారీ చేశారు. విదేశాలకు వెళతానని ఆయన ఎప్పుడూ దరఖాస్తు చేసుకోలేదు. అలాంటప్పుడు పారిపోతారని ఎలా భావిస్తారు?, పైగా చిదంబరం ఎవరో ప్రపంచం అంతా తెలుసు’ అని కపిల్ సిబల్ వాదించారు. కస్టడీ సమయంలో చిదంబరం నాలుగు కిలోల బరువు తగ్గారని, రానున్న చలి కాలం డెంగ్యూ వ్యాపించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయన్ను ఇంకా జైలులో ఉంచడం ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు. కేవలం చిదంబరాన్ని అవమానించే ఉద్దేశంతోనే జైలు నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. ఒకవేళ సాక్షులను ప్రభావితం చేస్తే, ఆ సాక్షికి అన్ని విధాలుగా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సిబల్ స్పష్టం చేశారు. అయితే చిదంబంరం ఇంత వరకు ఎవరినీ ప్రభావితం చేసిన దాఖలాలే లేవన్నారు.