క్రైమ్/లీగల్

రూ.కోటి జరిమానా చెల్లించిన గౌతమ్ షోరూం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 18: రాష్ట్ర రవాణ శాఖకు గుంటూరులోని కోడెల శివరామ్‌కు చెందిన గౌతమ్ హీరో షోరూం కోటి రూపాయల జరిమానా శుక్రవారం చెల్లించింది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించకుండా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ లేకుండా దాదాపు 576 వాహనాలను షోరూం యాజమాన్యం గతంలో విక్రయించింది. ఈమేరకు అప్పట్లో ఫిర్యాదు అందడంతో రాష్ట్ర రవాణ శాఖ అధికారులు కేసు నమోదు చేసి షోరూం లైసెన్సును రద్దుచేశారు. విచారణలో ప్రభుత్వానికి సుమారు 41లక్షల రూపాయల పన్నులను ఎగవేసినట్లు తేలింది. దీంతో గౌతమ్ షోరూం యజమానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా కోటి రూపాయల మేరకు జరిమానా విధించారు. ఈ షోరూంతో పాటు గుంటూరు జిల్లాలోని మరో ఏడు షోరూంలకు 39లక్షల రూపాయల మేర జరిమానాలను అధికారులు విధించారు.