క్రైమ్/లీగల్

వాహన షోరూంలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్,అక్టోబర్ 19: షార్ట్‌సర్క్యూట్ వలన ద్విచక్ర వాహనాల షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో 50వాహనాలు దగ్ధం అయ్యాయి. మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన గురించి ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు కథనం ప్రకారం మూసారాంబాగ్‌లోని హోండా ద్విచక్ర వాహన షోరూంలో శనివారం తెల్లవారుఝామున ఐదు గంటలకు షోరూం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడాన్ని అక్కడి వాచ్‌మన్ గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న మలక్‌పేట పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న మూడు ఫైర్‌ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూం కార్యాలయంలోని రిఫ్రిజిరేటర్ విద్యుత్‌వైర్ల నుంచి మంటలు చెలరేగాయని గుర్తించారు. ప్రమాదంలో వివిధ రకాల 50ద్విచక్ర వాహనాలు, కార్యాలయ సామాగ్రి, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. షోరూం మేనేజర్ రామకృష్ణ ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.