క్రైమ్/లీగల్

ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, అక్టోబర్ 19: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌పై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గత ఎన్నికల్లో ఓటర్లకు నకిలీ ఇళ్ళ స్థలాల పట్టాలను వంశీ పంపిణీ చేసినట్లు వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు ఆరోపణలకు తోడు రవికుమార్ అనే వ్యక్తి స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. జంక్షన్ ఎస్‌ఐ ఆశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాపులపాడు తహశీల్దార్ నరసింహారావు ఇళ్ళ పట్టాల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళి అమలులో ఉండగా ప్రభుత్వం పట్టాలు అందించినట్లు నమ్మించి నకిలీ పట్టాలను మండలంలోని పెరికీడు, కొయ్యూరు గ్రామాలలో కొంతమందికి పంపిణి చేశారని ఫిర్యాదులో తహశీల్దార్ పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన ఈ వ్యవహారంలో వంశీతోపాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనందున బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో జంక్షన్ పోలీసులు గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్, అయన అనుచరులపై ఛీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆశోక్‌కుమార్ వివరించారు.
*చిత్రం... గన్నవరం టీడీపీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌