క్రైమ్/లీగల్

ఠాణా సమీపంలో హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 20: పంజాగుట్ట ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి అయ్యాడు. పాత కక్షలతో రగిలిపోయిన ప్రత్యర్థులు ఇటీవలే బెయిల్‌పై జైలు నుంచి విడుదల అయిన రియసత్ అలీని వెంటాడి వేటాడి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ నెల చివరి వారంలో అన్వర్ అనే ఆటోడ్రైవర్‌ను పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సమీపంలో కొందరు వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనలో నిందితునిగా ఉన్న రియాసత్ అలీ లొంగిపోయాడు. ఇటీవలే బెయిల్‌పై రియసత్ విడుదల అయ్యాడు. అప్పటి నుంచి ప్రత్యర్థులు కాచుకొని ఉన్నారు. ఆదివారం ఉదయం 9గంటల ప్రాంతంలతో టీ తాగేందుకు బయటకు వచ్చిన రియసత్‌ను వెంబడించిన ఐదుగురు వ్యక్తులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్త్రావంతో కుప్పకూలిన అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట ప్రధాన రహదారిపై కత్తులతో వీరంగం చేస్తున్న వ్యక్తులను నిలువరించేందకు ఎవరూ సహసం చేయలేదు. చూస్తుండగానే నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన అనంతరం నిందితులను చంద్రాయణగుట్ట ప్రాంతంలో అబ్దుల్ రహ్మన్, మహ్మద్ అజార్, అబ్దుల్ అలీమ్‌ను అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన ఓమ్మి కారు, కొబ్బరి బోండాలు నరికే కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులు అజ్మద్, హసన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.