క్రైమ్/లీగల్

తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, అక్టోబర్ 20: తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో విషాదం నింపింది. ఈ సంఘటన కంది మండలం చెర్లగూడెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స చేయించుకునే స్థోమత లేక జీవితంపై విరక్తి చెందిన కూతురు మాశెట్టి నాగమ్మ (40) ఇంట్లో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
తన కూతురు చనిపోయిందన్న బాధతో తల్లి ఆలకుంట గంగమ్మ (70) ఇంట్లో ఉన్న దూలానికి ఉరి వేసుకొని మృతి చెందింది. తల్లీ కూతుర్ల మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఇంద్రకరణ్ ఎస్‌ఐ దశరథ్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వడ్డెర కులానికి చెందిన నాగమ్మకు పెండ్లి అయిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. అప్పటి నుంచి కూలీపని చేసుకుంటూ చెర్లగూడెంలో తల్లి గంగమ్మ వద్దనే ఉంటుంది. చాలా రోజులుగా అనారోగ్యం ఉండటం, చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే తల్లి గంగమ్మ కూడా ఆత్మహత్యకు పాల్పడింది.