క్రైమ్/లీగల్

యువకుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఏప్రిల్ 16: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లెనిన్ నగర్‌లో సోమవారం సాయంత్రం ధనాల చంటి అలియాస్ దుర్గారావు (23) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్వయాన అనే్న తమ్మునిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. సోమవారం సాయంత్రం స్థానిక రెల్లి వాడలోని వారి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గోదావరిఖని సీఐ వాసుదేవ రావు తెలిపిన వివరాల మేరకు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ధనాల రామారావుకు ముగ్గురు కుమారులు. వీరిలో ధనాల చంద్రశేఖర్ అనే వ్యక్తి రామగుండంలో ఉంటుండగా రామారావుతో దుర్గా రావుతోపాటు మరొకు తల్లిదండ్రి వద్దే ఉంటున్నారు. వీరికి కొద్ది రోజులుగా కుటుంబంలో గొడవలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో ధనాల చంద్రశేఖర్ సోమవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో లెనిన్ నగర్‌లోని తన సొంత ఇంటికి వచ్చి అక్కడ తల్లిదండ్రితో 2లక్షలు కావాలని గొడవకు దిగాడు. దీనికి తల్లిదండ్రి నిరాకరించడంతో కుటుంబంలో తనకు వాటా కావాలని మరింత ఘర్షణ పడ్డాడు. ఈ సమయంలో కొంత సమయం బయటకు వెళ్లిన చంద్రశేఖర్ మళ్లీ ఇంట్లోకి వచ్చి కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయగా ఈ సంఘటనలో చంద్రశేఖర్ తమ్ముడు ధనాల చంటి అలియాస్ దుర్గారావుపై చంద్రశేఖర్ కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో మృతి చెందిన్నట్లు సీఐ వాసుదేవ రావు తెలిపారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన తెలియగానే గోదావరిఖని ఎసిపి రక్షిత కె మూర్తి, సి ఐ వాసుదేవా రావు చేరుకొని వివరాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సి ఐ వాసుదేవా రావు తెలిపారు.