క్రైమ్/లీగల్

అయితే.. ఓకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: తుగ్లఖాబాద్ అటవీ ప్రాంతంలో గురు రవిదాస్ ఆలయ నిర్మాణానికి 400 చదరపుమీటర్ల స్థలం కేటాయింపుపై కేంద్రం సవరణ ప్రతిపాదనకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు డీడీఏ అధికారులు రవిదాస్ ఆలయాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని 200 చదరపుమీటర్ల జాగాలో ఆలయం నిర్మించాలని యోచిస్తున్నట్టు అటార్నీ జనరల్ కేకే వేణుకోపాల్ బెంచ్‌కు తెలిపారు. కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి సంబంధించి ఆరు వారాల్లో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. రవిదాస్ ఆలయం నిర్మించే చోట ఎలాంటి వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించకూడదని బెంచ్ స్పష్టం చేసింది. ఆలయం కోసం ఆందోళన చేస్తూ అరెస్టయిన వారినికి వ్యక్తిగత పూచీకత్తు తీసుకుని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. దక్షిణ ఢిల్లీలోని తుగ్లఖాబాద్ అటవీ ప్రాంతంలో 200 చదరపుమీటర్ల స్థలంలో రవిదాస్ ఆలయ నిర్మించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే కొన్ని షరతులు ఉన్నాయని శుక్రవారం కేంద్ర వెల్లడించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం అంగీకరించిందని వేణుగోపాల్ తెలిపారు. దీనిపై అన్ని వర్గాలు, అధికారులు, భక్తులలో సంప్రదింపులు జరిపినట్టు ఆయన చెప్పారు. కేంద్రం ప్రతిపాదనకు కేవలం ఇద్దరు పిటిషనర్లే అంగీకరించలేదని ఆయన పేర్కొన్నారు. మిగతా అన్ని వర్గాలు సానుకూలత వ్యక్తం చేశాయని వెల్లడించారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ సోమవారం లోగా లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు తెలపాలని ఆదేశించింది. దాన్ని చూసిన తురువాత ఆదేశాలు జారీ చేస్తామని బెంచ్ ప్రకటించింది. కాగా కోర్టు ఆదేశాల మేరకే ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ(డీడీఏ) రవిదాస్ ఆలయాన్ని కూల్చివేసింది. ఆలయం కూల్చివేతపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజల మనోభావాలను అందరూ గౌరవించాలని అలాగే చట్టానికి అనుగుణంగా నడచుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గురు రవిదాస్ ఆలయం కూల్చివేతకు నిరసనగా ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో ఆందోళనలు జరిగాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన కోర్టు ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీన్ని రాజకీయంగా వాడుకుండే తీవ్ర పరిణామాలుంటాయని బెంచ్ ఆగస్టు 19న హెచ్చరించింది.