క్రైమ్/లీగల్

హైవేపై ప్రమాదం.. రెండు కార్లు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, అక్టోబర్ 22: రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ఢీకొని దగ్ధం కాగా కారుల్లో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. హైద్రాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని మాదవరం శివారులోని గంగమ్మగుడి సమీపాన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎపి29 టిడి 1569 నెంబర్ గల కారు డ్రైవర్ శ్రీకాంత్ హైద్రాబాద్ నుండి విజయవాడకు బయలుదేరాడు. గంగమ్మ గుడి సమీపాన అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఇతని కారు అదే సమయంలో కోదాడ పట్టణానికి చెందిన పాత్రికేయుడు నరేందర్ తన భార్యతో హైద్రాబాద్ వెళ్తున్న కారును ఢీకొట్టగా షార్ట్‌సర్క్యుట్‌తో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన వీరు కారు నుండి సురక్షితంగా బయటపడగా మంటలు చెలరేగి రెండు కార్లు దగ్ధ్దమయ్యాయి. ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. అయితే ప్రాణనష్టం జరుగకపోవడంతోఅంతా ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ సత్యనారాయణగౌడ్ తెలిపారు.