క్రైమ్/లీగల్

మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేస్తూ, ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావడమేగాక, ఏ క్షణమైనా నోటిఫికేషన్‌ను జారీ చేయవచ్చని చెబుతున్నారు. మున్సిపల్ వార్డుల విభజన, రిజర్వేషన్లకు సంబంధించి పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గత కొన్ని నెలలుగా ఈపిటిషన్లపై విచారణ కొనసాగింది. అయితే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు అనుమానాలను లేవనెత్తుతూ దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. దీంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
లభించినట్టయింది. మున్సిపోల్స్ నిర్వహణకు ఇప్పటికే ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 121 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో సుమారు 800 మంది జనాభా ఉన్నారు. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫిర్జాదీగూడ, బడంగ్‌పేట, నిజాంపేట, బండ్లగూడ, మీర్‌పేటతోపాటు జవహర్‌నగర్ మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాల్టీల కాలపరిమితి ఇంకా ముగియలేదు. పాల్వంచ, మందమర్రి, మణుగూరుల్లో సాంకేతిక కారణాలతో ఎన్నికలు నిర్వహించడం లేదు. జడ్చర్ల, నకిరేకల్ గ్రామాల విలీన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లకు కాలపరిమితి ఇంకా ముగియలేదు. కొన్ని మున్సిపాల్టీల్లో ఎన్నికలపై గతంలో హైకోర్టు స్టే విధించింది.
వనరులు సమకూర్చండి
ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. అనివార్యంగా మున్సిపల్ వార్డుల విభజనలో అనేక అవకతవకలు జరిగాయని ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగిందని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల నిర్వహణకు కావల్సిన పూర్తి సమాచారాన్ని, వనరులను రాష్ట్ర ప్రభుత్వ సమకూర్చుకోవాలని సీపీఐ కోరింది. హైకోర్టు తీర్పును సీపీఐ స్వాగతిస్తోందని, ఎన్నికల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.