క్రైమ్/లీగల్

బెయిల్ వచ్చినా.. జైల్లోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి స్వల్ప ఊరట లభించింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో బెయిల్ మంజూరైంది. బెయిల్ దక్కినా ఆయన విడుదలయ్యే పరిస్థితి లేదు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ కేసులో చిదంబరం కస్టడీలో ఉన్నారు. కాబట్టి సీబీఐ కేసులో బెయిల్ దక్కినా ఈడీ కస్టడీ కొనసాగుతుంది. 74 ఏళ్ల చిదంబరంను ఆగస్టు 21 రాత్రి నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలోని జోర్‌బాగ్ నివాసం నుంచి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తరువాత తీహార్ జైలుకు జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తీహార్ జైలులో ఉండగానే ఢిల్లీ కోర్టు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 18న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ ఆర్థిక మంత్రిని తన కస్టడీలోకి తీసుకుంది. ఈనెల 24 వరకూ ఈడీ కస్టడీ ఉంటుంది. చిదంబరానికి బెయిల్ ఇవ్వకూడదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పక్కన బెట్టిన సుప్రీం కోర్టు మంగళవారం బెయిల్ ఇస్తున్నట్టు ప్రకటించింది. సీబీఐ విచారణకు విధిగా హాజరుకావాలని, అధికారులకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీబీఐ ఆరోపణలను బెంచ్ తోసిపుచ్చింది. ఆయనకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ ట్రయల్ కోర్టులో ఆరు రిమాండ్ దరఖాస్తులు చేసింది. కాగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్ బానుమతి నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ ఆరోపణలను తోసిపుచ్చింది.‘ఆయన ఎప్పుడు, ఏ సాక్షిని ప్రభావితం చేశారో వివరాలు లేవు. ఇద్దర్ని కలిసినట్టు దర్యాప్తు సంస్థ చేస్తున్న ఆరోపణల నిరూపించలేదు’అని ధర్మాసనం పేర్కొంది. ఈ-మెయిల్సా, ఎస్‌ఎంస్‌లా, టెలిఫోన్ సంభాషణలా, లేఖ ద్వారా సాక్షులను సంప్రదించారా? అన్న దానిపై వివరాలు పొందుపరచలేకపోయారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న చిదంబరానికి బెయిల్ ఇస్తే విదేశాలకు వెళ్లిపోతారన్న సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలతో బెంచ్ ఏకీభవించలేదు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చిదంబరం సాక్షులను ప్రభావితం చేసినట్టు ఎక్కడా ఆధారాలు లేవని న్యాయమూర్తులు ఎస్‌ఎస్ బోపన్న, హృషికేష్ రాయ్‌తో కూడిన ధర్మాసం 27 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థలో విదేశీ పెట్టుబడులు రావడానికి ఆర్థిక మంత్రిగా చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు. దీనిపై 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. అదే ఏడాది ఈడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరం సహా 12 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. గత వారం ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితులందరిపైనా మనీలాండరింగ్ అభియోగాలు ఉన్నాయి.
కాగా కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరానికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు ధర్మాసనం లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ బాండ్లు ప్రత్యేక కోర్టుకు అందజేయాలని బెంచ్ ఆదేశించింది. విచారణ అధికారులకు అందుబాటులో ఉండాలని మాజీ ఆర్థిక మంత్రికి స్పష్టం చేశారు.

*చిత్రం... కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం