క్రైమ్/లీగల్

జైలు హెడ్‌వార్డర్‌పై ఖైదీ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, అక్టోబర్ 22: ఫోన్ సౌకర్యం వినియెగించుకునే విషయంలో హెడ్‌వార్డర్‌తో వాగ్వివాదానికి దిగిన ఖైదీ అతనిపై దాడికి పాల్పడ్డాడు. డబీర్‌పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనం కేసులో వరంగల్ జైలులో మూడు సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్న గోలి రాజేష్ అక్కడ అనుచిత ప్రవర్తన కారణంగా పనిష్‌మెంట్ కింద ఈ సంవత్సరం జనవరిలో చంచల్‌గూడ జైలుకు తరలించబడ్డాడు. ఇక్కడికి వచ్చిన తరువాత కూడా అతని మానసికస్థితి సరిగా లేకపోవడంతో జైలు అధికారులు అతనిని పలుమార్లు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స అందించారు. సోమవారం సాయంత్రం జైలు ఖైదీలు బయట ఉన్న తమ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడే సౌకర్యం విషయమై గోలి రాజేష్ అక్కడ విధులు నిర్వహిస్తున్న హెడ్‌వార్డర్ సత్యనారాయణతో వాగ్వివాదానికి దిగాడు. కోపోద్రిక్తుడై సత్యనారయణపై దాడికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇతర సిబ్బంది రాజేష్‌ను కట్టడి చేసారు. జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు డబీర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.