క్రైమ్/లీగల్

ఆధార్‌తో సోషల్ మీడియా అనుసంధానం కేసుల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: సోషల్ మీడియాతో ఆధార్ అనుసంథానికి సంబంధించి వివిధ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ సుప్రీం కోర్టు మంగళవారం తనకు బదిలీ చేసుకుంది. అదేవిధంగా సామాజిక మాధ్యమం దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి సంబంధించి నివేదికను వచ్చే ఏడాది జనవరిలో అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు దీపక్ గుప్తా, అనిరుద్ధా బోస్ ధర్మాసనం వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో సంబంధిత అంశాలన్నింటినీ ప్రధాన న్యాయమూర్తికి నివేదించాలని రిజిస్ట్రిని కోరింది. అదేక్రమంలో ఫేస్ బుక్ పిటీషన్ బదిలీని కూడా సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతించింది. సామాజిక మాధ్యమాన్ని ఏ విధంగా నియంత్రించాలన్న దానిపై తమకు జనవరిలో నివేదిక ఇవ్వాలని కేంద్రానికి స్పష్టం చేసింది. వివిధ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల బదిలీ చేయాలని ఫేస్ బుక్ అభ్యర్థనను వ్యతిరేకించిన అటార్నీ జనరల్, తమిళనాడు తరఫు న్యాయవాది కేకే వేణుగోపాల్ వెనక్కి తగ్గడంతో సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వ వైఖరిని వివరించారు. వ్యక్తుల ప్రైవైసీని ఉల్లంఘించడం తమ ఉద్దేశ్యం కాదని జాతీయ భద్రత సార్వభౌమత్వానికే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన అటార్నీ జనరల్ వేణుగోపాల్ ఓ ఉగ్రవాది తన ప్రైవైసీ హక్కును కాపాడుకోవడానికి ప్రయత్నించజాలడని అన్నారు. సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని సొలిసిటర్ జనరల్ వివరించారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ముసాయిదాపై కొందరు పిటీషనర్లు చేసిన వాదనను తిరస్కరించారు. ప్రభుత్వ ఉద్దేశ్యంతో వ్యక్తిగత స్వేచ్చను హరించాలన్న ఆలోచన లేదని అన్నారు.