క్రైమ్/లీగల్

అంతర్ రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, ఏప్రిల్ 16: కుటుంబ తగాదాలతో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంచాగల్ గ్రామ 8వ వార్డు సభ్యురాలు బాస్కుల కవిత(35) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలి భర్త యాదగిరి ఇజిఎస్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. భార్య, భర్తల మధ్య గత కొంత కాలంనుండి తరుచూ గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈక్రమంలోనే సోమవారం ఉదయం ఇద్దరి మధ్య తీవ్రంగా ఘర్షణ జరిగినట్లు చెప్పారు. అనంతరం భర్త యాదగిరి ఫీల్డ్ అసిస్టెంట్ పనిమీద బయటికి వెళ్ళగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తమ వ్యవసాయ అవసరాలకు తెచ్చిపెట్టిన క్రిమిసంహారక మందును సేవించినట్లు తెలిపారు. క్రిమిసంహారక మందు సేవించి అపస్మారకస్థితిలో ఉన్న కవితను చుట్టుప్రక్కల వారు గమనించి వెంటనే 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే కవిత మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా కేసు నమోదు చేసుకుని దార్యప్తు చేస్తున్నట్లు స్థానిక సిఐ రావుల నరేందర్ తెలిపారు. మృతురాలికి భర్త యాదగిరి, కుమారుడు, కూతురు ఉన్నారు.