క్రైమ్/లీగల్

అద్దె బస్సుల టెండర్లపై పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: ఆర్టీసీ అద్దె బస్సులకు టెండర్లను పిలవడాన్ని సవాలు చేస్తూ కార్మిక సంఘాలు హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశాయి. 1035 బస్సులను అద్దెకు తీసుకోడం కోసం టెండర్లను ఆహ్వానిస్తూ ఆర్టీసీ యాజమాన్యం జారీ చేసిన నోటిఫికేషన్ చెల్లదని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీకి కార్యనిర్వాహక బోర్డు లేకుండా ఇన్‌చార్జి అధికారి టెండర్లు పిలవడం చట్టవిరుద్ధమని పిటిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఏమీ తెల్చకుండానే శాశ్వత ప్రాతిపదికపై అద్దె బస్సులను తీసుకోవడం ఆర్టీసీ యాజమాన్య నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అయితే ఆర్టీసీ తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ ఆర్టీసీ సొంతంగా బస్సులను నడిపే స్థితిలో లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అద్దె బస్సులను తీసుకుంటున్నామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీన వింటామని పేర్కొంది. ఇప్పటికే ఆర్టీసీ పై దాఖలై పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లతో పాటు దీనిని కూడా వింటామని హైకోర్టు పేర్కొంది.
ప్రభుత్వానికి అందిన ఆర్డర్ కాపీ
కార్మికులతో చర్చలు జరపాలని సూచిస్తూ హైకోర్డు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ కాపీ ప్రభుత్వానికి చేరింది.
పీవీ కృష్ణయ్య, కే రాంరెడ్డి, నరేష్‌రెడ్డి చిన్నోళ్ల పిటిషనర్ల తరఫున వాదించగా, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందర్‌రావు, ఆర్టీసీ కౌన్సిల్ ఎన్ వాసుదేవరెడ్డి, రవాణా శాఖ జీపీ డి ప్రకాశ్‌రెడ్డిలు వాదనలు వినిపించారు. తక్షణమే ఇరువర్గాలు చర్చలు ప్రారంభించి సాధ్యాసాధ్యాలను మాట్లాడుకోవాలని, ప్రభుత్వం, కార్పొరేషన్ చర్చలను పర్యవేక్షించాలని హైకోర్టు సూచించింది.
డిమాండ్లపై సానుకూల పరిష్కారంతో ఇరు వర్గాలూ 28వ తేదీన తమ నివేదికలను కోర్టు ముందుంచాలని ఆదేశించింది.