క్రైమ్/లీగల్

రాజ్యాంగ ధర్మాసనానికి ‘అనర్హత’ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: కర్నాటకలో 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన అప్పటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ నిర్ణయంపై దాఖలైన కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ సుప్రీం కోర్టును అభ్యర్ధించారు. కర్నాటక కాంగ్రెస్, కర్నాటక పీపీసీ చీఫ్ దినేష్ గుండూరావు తరఫున ఈ కేసులో తన వాదనలు వినిపించిన సిబల్ పలు అంశాలను ప్రస్తావించారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేసే అధికారం ఎవరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను అనర్హులుగా రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కేసులో రాజ్యాంగ నిబంధనలకు సంబంధించిన అనేకానేక అంశాలు ఉన్నాయని అన్నారు. కాబట్టి ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడమే మంచిదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రాజ్యాంగపరమైన సందిగ్ధతలు, సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే తన వినతిపై సానుకూలంగా స్పందించాలని న్యాయమూర్తులు ఎన్‌వీ రమణ్, సంజీవ్ ఖన్నా, కృష్ణ మారుతి సభ్యులుగా గల సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. స్పీకర్ రమేష్ కుమార్ 17 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో, కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలగా, యడియూరప్ప నాయకత్వంలో బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికార పగ్గాలను చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, స్పీకర్ తమను రాజకీయంగా దెబ్బకొట్టడానికే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ రాజీవ్ ధావన్ ఆరోపించారు. ఇలావుంటే, సిబల్, నాయయమూర్తి రమణ మధ్య ఆసక్తికరమైన సంభాషణ కొనసాగింది. రాజీనామాలు చేయడం తప్పా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, వాటి వెనుకగల కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని సిబల్ అన్నారు. దురుద్దేశపూర్వకంగా రాజీనామాలు చేస్తే, వాటినా ఆమోదించడంలో అర్థం లేదన్నారు. ఒకవేళ అవినీతికి వ్యతిరేకంగా లేదా అవినీతి జరుగుతున్నదన్న అనుమానంతో రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళ్లాలని అనుకోవడం తప్పెలా అవుతుందని సిబల్‌ను న్యాయమూర్తి రమణ నిలదీశారు. దీనిపై సిబల్ స్పందిస్తూ, నిజంగానే అంతటి ఉత్తమ విలువలకు కట్టుబడి ఎవరైనా రాజీనామా చేసివుంటే, తప్పకుండా ఆహ్వానిస్తానని, అలాంటి వారిని తాను గౌరవిస్తానని అన్నారు. అయితే, మంత్రికావాలన్న ఉద్దేశంతో లేదా మరేదైనా కుట్రతో రాజీనామా చేయడం తప్పని స్పష్టం చేశారు.
లిఖితపూర్వకంగా రాజీనామా లేఖలను సమర్పించడం, వాటిని స్పీకర్ ఆమోదించడం వంటి నాటకీయ చర్యలతో ఇలాంటి సంక్లిష్టమైన సంక్షోభానికి లేదా వివాదానికి తెరపడినట్టు అనుకోరాదని అన్నారు. రాజ్యాంగపరమైన అనేక అంశాలు ఇందులో ఇమిడివున్నాయని, కాబట్టి ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని కోరారు. ఈ వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.