క్రైమ్/లీగల్

అశ్వత్థామరెడ్డిపై ఠాణాలో ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ పరోక్షంగా వారి ఆత్మహత్యలకు యూనియన్ నేత అశ్వత్థామ రెడ్డి కారణమవుతున్నారని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో రాజు అనే ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు చేశారు. సమ్మె పొడిగింపుతో నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ మంచి అవకాశం ఇచ్చారని, దానిని ఉపయోగించుకోవాలని ఆయన కార్మికులను కోరారు. ఆర్టీసీ ఆర్థిక వ్యవస్థ బాగు లేదనే విషయాన్ని మిగతా కార్మికులు కూడా ఆలోచించి విధులకు హాజరుకావాలని ఆయన కోరారు. అనుభవం లేని డ్రైవర్లతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కార్మికులు మరోసారి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మికుల్లో విలీనం అనే విషాన్ని అశ్వత్థామ రెడ్డి నింపారని ఆయన ఆరోపించారు. తాను మాత్రం విధులకు హాజరవుతున్నానని, తనను ఎవరూ ప్రలోభాలకు గురి చేయలేదని రాజు వెల్లడించారు.