క్రైమ్/లీగల్

68మంది డీఎస్పీల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకేసారి 68 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర హోం శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. చిక్కడపల్లి ఏసీపీ వై.నర్సింహారెడ్డి మల్కాజిగిరికి, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ వై.వెంకటేశ్వర్ రావు మిర్యాలగూడకు బదిలీ అయ్యారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న బీ.రవీంద్ర కుమార్ కాజీపేట్‌కు, సీహెచ్‌ఆర్‌వీలో పనిచేస్తున్న ఫణీందర్ నర్సంపేటకు, హైదరాబాద్ సీఐడీలో పనిచేస్తున్న సీహెచ్.లక్ష్మీనారాయణ మంచిర్యాలకు, సీఐడీలో పనిచేస్తున్న ఎస్.కృష్ణప్రసాద్‌ను మియాపూర్‌కు, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్.జయరామ్ రాచకొండ వనస్థలిపురంనకు, కరీంనగర్ ట్రాఫిక్‌లో పనిచేస్తున్న కేఆర్‌కే.ప్రసాద్ రావు పాల్వంచకు, మహబుబ్‌నగర్ సీసీఎస్‌లో పనిచేస్తున్న జీ.శ్రీనావాస్‌ను పరిగికి, ములుగులో పనిచేస్తున్న జే.విజయ సారథి కరీంనగర్ రూరల్‌కు, ఏ.లక్ష్మీనారాయణ తాండురుకు, ఖమ్మంలో పనిచేస్తున్న బీ.రామానుజంను ముణుగూరుకు, మెదక్‌లో పనిచేస్తున్న వీ.రఘును ఆర్మూరుకు, వేములవాడలో పనిచేస్తున్న పీ.వెంకట రమణను జగిత్యాలకు బదిలీ చేశారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న డీఏస్పీలు ఎస్.చంద్రకాంత్‌ను వేములవాడకు, జీ.శ్రీ్ధర్ మహబూబ్‌నగర్‌కు, గౌస్‌బాబా మెట్‌పల్లికి, జీ.నరేందర్ జైపూర్ ఏసీపీగా, పున్నం రవీందర్‌రెడ్డి ఇల్లందు, ఏ.రఘు కోదాడ, మహ్మద్ హబీబ్‌ఖాన్ పెద్దపల్లికి, ఆర్‌జీ. శివమారుతి హైదరాబాద్‌లోని ఆసీఫ్‌నగర్‌కు, శశాంక్ రెడ్డి కామారెడ్డి రూరల్‌కు, పీ.శ్రీనివాస్ వరంగల్ పరకాలకు, మోహన్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌కు, ఎస్.రవి కుమార్ సైబరాబాద్ ఎస్‌బీ విభాగానికి బదిలీ అయ్యారు. అదేవిధంగా వివిధ ప్రాంతాలకు బదిలీ అయిన వారిలో జీ.వెంకటేశ్వర్ రెడ్డి, జీ.వెంకట్‌రావు, టీ.గోవర్ధన్, పీ.రవీందర్ రెడ్డి, కే.నర్సింహారెడ్డి, ఎన్.వెంకటరమణ, ఎం.జితేందర్ రెడ్డి, సద్దుల సారంగపాణి, పీ.శ్రీనివాస్ రెడ్డి, కే.పురుషోత్తం ఉన్నారు. ఎన్‌ఎస్.మోహన్ రాజాను ఖమ్మం రూరల్‌కు, జీ.బాలస్వామిని హన్మకొండ ట్రాఫిక్‌కు, సయ్యద్ నరుూముద్దీన్ జావీద్‌ను హైదరాబాద్ ఎస్‌బీకి, మహ్మద్ మాజీద్ ఫలక్‌నుమాకు, పీ.చంద్రశేఖర్ సిరిసిల్లకు,
ఆర్.బాలరంగయ్య హైదరాబాద్ నార్త్ జోన్ ట్రాఫిక్‌కు, పీ.వెంకటరమణ హైదరాబాద్ గోపాపురం ఏసీపీగా నియమితులయ్యారు. పీవీ.గణేష్ ఖమ్మం టౌన్‌కు, కే.రాంమోహన్‌రెడ్డి బాలానగర్ ట్రాఫిక్‌కు, సీహెచ్.శ్రీ్ధర్ చిక్కడపల్లికి, ఎస్‌ఆర్.దామోదర్ రెడ్డి బాన్స్‌వాడకు, టీ.ఆనంద్‌రెడ్డి దేవరకొండకు, ఎస్.శ్రీనివాస్ రావు హుజురాబాద్‌కు, ఏ.సంపత్‌రావు భూపాలపల్లికి, కే.పురుషోత్తం రెడ్డి ఎస్‌ఐబీ ఇంటెలిజెన్స్‌కు, జీ.రాంమోహన్ రెడ్డి, పీ.వెంకటగిరి, కే.రవీందర్ రెడ్డి, ఎం.జీతేందర్, జీ.రమేష్, జీ.వెంటేశ్వర్ బాబు ఇంటెలిజెన్స్‌కు, పీ.నరేష్‌రెడ్డి బేగంపేట్‌కు, గంధం మనోహర్ స్టేషన్ ఘన్‌పూర్‌కు, ఎన్.సుభాష్ బాబు హ్యూమన్‌రైట్స్ కమిషన్‌కు, జే.నర్సయ్య హైదరాబాద్ ఎస్‌బీకి బదిలీ ఆయ్యారు. అలాగే, ఎన్.సుధీర్‌బాబు వరంగల్‌కు, టీ.మోహన్‌రెడ్డి హైదరాబాద్ వెస్ట్ జోన్ ఎస్‌బీకి, ఏ.గంగారామ్ భైంసాకు, ఎం.గంగాధర్ సీఐడీ విభాగానికి, కేఎం.కిరణ్ కుమార్ వనపర్తికి, ఏ.మధుసూదన్ ఏసీబీకి, కే.సత్యనారాయణ వైరా డివిజన్‌కు బదిలీ అయ్యారు.

-