క్రైమ్/లీగల్

అనుమానాస్పదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధారూర్, ఏప్రిల్ 16: వికారాబాద్ జిల్లా మైలారం రైల్వేస్టేషన్‌లో యువతి అనుమానస్పదంగా మృతిచెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాలాల్ మండలం పగిడాయాల్ గ్రామానికి చెందిన జ్యోతి(21) హైదరాబాద్‌లోని లింగంపల్లిలోని బ్యూటీపార్లర్‌లో బ్యూటీషియన్‌గా పని చేస్తుంది. జ్యోతి తన తల్లిదండ్రులైన కాశమ్మ, మల్లికార్జున్‌తో కలిసి తాండూరులో ఉంటుంది. ప్రతిరోజు తాండూరు నుంచి లింగంపల్లికి రైలులో ప్రయాణం చేస్తుంటుంది. ఆదివారం లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో తాండూరు వెళ్ళే రైలులో బయలుదేరింది. వికారాబాద్ నుంచి బయలుదేరిన అనంతరం తన అక్క శోభతో ఫోన్‌లో మాట్లాడి వికారాబాద్ నుంచి తాండూరుకు రైలు వస్తుందని అరగంటలో ఇంటికి చేరుకుంటానని తెలిపింది. అనంతరం జ్యోతి ఫోన్ కలవలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌కు చెందిన మహేష్ అనే వ్యక్తి జ్యోతి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మైలారం స్టేషన్‌లో జ్యోతి చనిపోయిందని సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.